పెదపాడు: మహిళ ప్రాణాలు కాపాడిన పోలీసులు

67చూసినవారు
పెదపాడు: మహిళ ప్రాణాలు కాపాడిన పోలీసులు
పెదపాడు మండలం ఏపూరుకు చెందిన నాగేశ్వరమ్మ(55) ఇంటి స్థలం సరిహద్దు విషయమై నెలకొన్న వివాదంతో మనస్తాపానికి గురై బుధవారం రైలు కిందపడి చనిపోతానని కుటుంబ సభ్యులకు చెప్పి బయల్దేరారు. కుటుంబ సభ్యులు డయల్ 112కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఎస్సై శారదా సతీశ్, హెడ్ కానిస్టేబుల్ వీరబాబు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి రైలు పట్టాలపై నడుచుకుంటూ వెళ్తున్న ఆమెను స్టేషన్ కు తీసుకొచ్చి కౌన్సెలింగ్ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్