ఏలూరు కోటదిబ్బ సబ్ స్టేషన్ 11 కేవీ మెయిన్ బజార్ ఫీడర్ 11కేవీ వైఎంహెచ్ఏ హాల్ విద్యుత్ తీగల మరమ్మతు నేపథ్యంలో ఈనెల 6న విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఈఈ అంబేడ్కర్ శనివారం తెలిపారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 వరకు సరఫరా ఉండదన్నారు. రిక్షా ఘాటి, 7 గోలీల సెంటర్, సాంబారు పునుగులు సందు, వేణు గోపాల స్వామి టెంపుల్, విజయ లక్ష్మి థియేటర్, బుద్ధ పార్క్, పంట కాలువ రోడ్డు ప్రాంతాలకు సరఫరా ఉండదన్నారు.