తంగెళ్లమూడి విద్యుత్ ఉపకేంద్రం పరిధిలో ఈ నెల 2న విద్యుత్ తీగల మరమ్మతులు, చెట్ల కొమ్మల తొలగింపు పనులు చేపట్టనున్నట్లు డివిజన్ ఈఈ నటరాజన్ తెలిపారు. ఎమ్మార్సీ కాలనీ, మామయ్యగారి తోట, బాపూజీ కాలనీ, ఎస్ఎన్నార్ నగర్, రైల్వేస్టేషన్ రోడ్డు, ఆదివారపుపేట, లక్ష్మీవారపుపేట, పెన్షన్ లైను, గన్ బజారు, వీవీ నగర్ తదితర ప్రాంతాల్లో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు.