ఏలూరు నగరంలోని స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో సంఘసంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను అధికారులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ గంట పద్మశ్రీ ప్రసాద్ పాల్గొన్నారు. అనంతరం సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలకు పూలే ఒక ఆదర్శమని అన్నారు.