పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ‘షార్ట్ ఫిలిం’ కాంటెస్ట్‌

74చూసినవారు
పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ‘షార్ట్ ఫిలిం’ కాంటెస్ట్‌
ఏలూరు జిల్లాలో పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ‘షార్ట్ ఫిలిం’ కాంటెస్ట్‌ నిర్వహించనున్నట్లు ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ శుక్రవారం తెలిపారు. బాలబాలికలు, మహిళల సేఫ్టీ, సైబర్ క్రైమ్, రోడ్డు సేఫ్టీకి సంబంధించి అవగాహన కల్పిస్తూ 1 నుంచి 2 నిమిషాల నిడివి వీడియో తీసి ఆగస్ట్ 13వ తేదీ లోపు 99488 90429 నంబర్‌కు వాట్సాప్ చేయాలన్నారు. ఆగస్టు 15న బహుమతులు అందజేస్తామని అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్