కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమ ప్రభుత్వమని, ప్రజల కలలను నెరవేర్చేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పనిచేస్తున్నారని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. శనివారం ఏలూరు జ్యూట్‌మిల్ జంక్షన్ సమీపంలోని కృష్ణ - ఏలూరు కాల్వపై నిర్మిస్తోన్న బ్రిడ్జి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, ఇచ్చిన మాట ప్రకారం సమయానికే బ్రిడ్జి నిర్మాణం పూర్తిచేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.