ఏలూరు జిల్లాలో నాణ్యమైన విద్యుత్తుకి చర్యలు

54చూసినవారు
ఏలూరు జిల్లాలో నాణ్యమైన విద్యుత్తుకి చర్యలు
ఏలూరు జిల్లాలోని వ్యవసాయ, గృహా విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ ను అందించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా విద్యుత్ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. ₹. 176 కోట్లతో వ్యవసాయ ఫీడర్ల నుండి వ్యవసాయేతర సర్వీసులను వేరుచేసే ఫీడర్ల విభజన కార్యక్రమాలు, అదే విధంగా ₹. 66. 51 కోట్లతో ఓవర్ లోడ్ ఫీడర్ల విభజన పనులను పూర్తి చేయాలన్నారు

సంబంధిత పోస్ట్