టి. నర్సాపురం మండలం కృష్ణాపురం గ్రామంలో నాటు సారా స్థావరాలపై ఎక్సైజ్ అధికారులు ఆదివారం దాడులు నిర్వహించారు. ఈ దాడిలో శ్రీను అనే వ్యక్తిని అరెస్ట్ చేసి, అతని వద్ద ఉన్న 6 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. అలాగే, 100 లీటర్ల పులిసిన బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. నాటు సారా తయారీ లేదా విక్రయం చేసిన పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ సీఐ అశోక్ హెచ్చరించారు.