ఏలూరు పార్లమెంట్ వైసీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. టీడీపీ- జనసేన కులాల మధ్య చిచ్చు పెడుతుందన్నారు. లేనిపోని ఆరోపణలు చేయడం విరమించుకోవాలని సూచించారు. తమపై బురద జల్లడానికే ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారన్నారు. తను ఎంపీగా పదవి పగ్గాలు చేపట్టిన తర్వాత యువత అభివృద్ధికి అనేక పథకాలు చేపడతామన్నారు.