మంగళవారం తడికలపూడి గ్రామంలో టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. టీడీపీ మండల అధ్యక్షుడు ఏలూరి హరి రామకృష్ణ హరిబాబు మాట్లాడుతూ..మహిళలను అవమానించిన ఒక మీడియా సంస్థపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కృష్ణంరాజు మహిళలకు క్షమాపణలు చెప్పాలని, ఆయనను అరెస్ట్ చేయాలంటూ మహిళలు నినాదాలు చేశారు.