భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో పేద ప్రజలకు ఇంటి స్థలాలను పెంచి తక్షణమే అందజేయాలని ఏలూరు మండల తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. పోరాడతాం పేదవారి సొంత ఇంటి కోసం, ఇవ్వాలి పట్టణ ప్రాంతాల్లో పేదలకు 2 సెంట్లు ఇళ్ల స్థలం, ఇవ్వాలి గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు 3 సెంట్లు ఇళ్ల స్థలం, అంటూ నినాదాలు చేశారు.