సంపద సృష్టించే బృహత్తర కార్యం కూటమి ప్రభుత్వాధినేతలతోనే సాధ్యమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి విశ్వాసం వ్యక్తం చేశారు. శనివారం ఏలూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వినతులందించేందుకు వచ్చిన వారితో కిక్కిరిసింది. తనను కలిసేందుకు వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించిన ఎమ్మెల్యే వారి సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకున్నారు. అనంతరం వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.