ఏలూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో అత్యంత పటిష్టమైన బందోబస్తు మధ్య స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మంత్రి కొలుసు పార్థసారథి హాజరై పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో ఎంతోమంది స్వాతంత్య్ర సమరయోధులు ఉన్న గడ్డ అని అన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని తెలియజేశారు.