విజయవాడలో తలెత్తిన వరద విపత్తు సమయంలో ఆ ప్రాంత ప్రజలకు బాసటగా నిలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకు హుటాహుటిన అక్కడకు చేరుకున్న ఎమ్మెల్యే చంటి సేవా కార్యక్రమాలను ముమ్మరం చేశారు. రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారధితో కలిసి నిరాశ్రయులై ఉన్నవారిని ఆదుకునేందుకు చర్యలు చేపట్టారు. బుధవారం దుప్పట్లు, టవల్స్‌ను బాధితులకు అందించిన ఆయన వారికి భరోసానిచ్చారు. అన్ని విధాలా అండగా ఉంటామని పేర్కొన్నారు.