ఏప్రిల్ 14వ తేదీ సోమవారం ఏలూరు కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో జరగవలసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పిజిఆర్ఎస్)ను రద్దుపరచడమైనదని జిల్లా రెవెన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు సెలవు కావున ఈనెల 14వ తేదీ సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేసామన్నారు.