ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి ఏలూరు జిల్లా భీమడోలుకు చెందిన గుండుమోలు బాలాజీ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా బుధవారం ఏలూరు కలెక్టరేట్ లో నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, ఏలూరు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వికి బాలాజీ ఒక సెట్ నామినేషన్ పత్రాన్ని సమర్పించారు. అలాగే ఇప్పటి వరకు మూడు నామినేషన్లు దాఖలు అయినట్లు కలెక్టర్ తెలిపారు.