అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల పాటు యోగాంధ్ర పేరుతో మాసోత్సవాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది . ఇందులో భాగంగా ప్రతీ జిల్లాలో ప్రజలు రోజూ యోగాసనాలు వేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తున్న యోగాంధ్రలో రాజకీయ నాయకులు, అధికారులు, పోలీసులు కూడా పాల్గొని యోగాసనాలు చేస్తున్నారు. శనివారం పశ్చిమగోదావరి జిల్లాలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు పాల్గొన్నారు.