సదరం సర్టిఫికెట్ల జారీపై వైద్య బృందాల పరిశీలన కొరకు సూక్ష్మ ప్రణాళిక, రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశించారు. గురువారం రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి కె. కన్నబాబు, సెర్ఫ్ సిఇఓ వీరపాండ్యన్ సదరం సర్టిఫికెట్ల పంపిణీపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి పాల్గొన్నారు.