ఏలూరు జిల్లాలో ఈ నెల 15న ప్రతీ గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో స్వచ్ఛంద్రా - స్వర్ణాంధ్ర కార్యక్రమం సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. గురువారం సబ్ కలెక్టర్లు, జిల్లా అధికారులు, రెవిన్యూ అధికారులతో టేలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ప్రభుత్వం రూపొందించిన యాప్ నందు స్వచ్చంద్రా కార్యక్రమాల వివరాలను నమోదు చేయాలని తహశీల్దార్లకు సూచించారు.