ఏలూరు పర్యటనకు తొలిసారిగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వర్యులు, సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఆదివారం విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలో ఆయనకు పూల బొకే ఇచ్చే సాలువతో ఘనంగా సత్కరించారు. అనంతరం అక్కడ నుండి జనసేన పార్టీ కార్యాలయానికి తరలివెళ్లారు.