ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి సహకరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఆగిరిపల్లిలో జీరో పావర్టీ- పీ4 ప్రారంభోత్సవ ప్రజావేదిక కార్యక్రమం జరిగింది. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ, ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో పరిశ్రమలు నెలకొల్పేందుకు అవసరమైన అన్ని వనరులు అందుబాటులో ఉన్నాయనిన్నారు.