దేవరపల్లి మండలం యర్నగూడెం–పోతవరం రోడ్డుపై రేషన్ బియ్యం అక్రమ రవాణాను విజిలెన్స్, సివిల్ సప్లై అధికారులు పట్టుకున్నారు. నల్లజర్ల నుంచి బిక్కవోలుకు తరలిస్తున్న లారీ నుంచి 400 బస్తాల్లో 18 వేల కేజీల బియ్యం స్వాధీనం చేసుకున్నారు. బియ్యం గడువు ముగిసినదని గుర్తించి లారీని సీజ్ చేసి ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.