ద్వారకాతిరుమల మండలం పంగిడి గూడెంలో పేకాట శిబిరంపై ఆదివారం సీఐ విల్సన్, ఎస్సై సుధీర్ బాబు దాడి చేశారు. గ్రామంలోని సామాయిల్ తోటలో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో ఈ దాడి నిర్వహించామని తెలిపారు. ఇందులో ఏడుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.39,000 నగదు, 11 సెల్‌ఫోన్లు, 3 మోటార్‌సైకిళ్లు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు.