మండలంలోని కాశిపాడు విఆర్‌ఒగా పనిచేస్తున్న చంద్రశేఖర్(50) ఆదివారం గుండెపోటుతో మృతిచెందారు. శేఖర్ పెంటపాడులో కాపురం ఉంటున్నారు. ఉదయం గుండెపోటు రావటంతో ఆయన కుటుంబ సభ్యులు రాజమండ్రి ప్రయివేటు ఆసుపత్రికి తీసుకెళ్లి తిరిగి వస్తుండగా మార్గమధ్యలో షుగరు పెరిగి చనిపోయినట్లు విఆర్‌ఒ అసోషియేషన్ మండల అధ్యక్షులు కేశవ మూర్తి తెలిపారు. శేఖర్‌కి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన మృతదేహాన్ని సొంత ఊరు అయిన పెదనిండ్రకొలను తీసుకుని వెళ్లినట్లు చెప్పారు.