ఏలూరు జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. ప్రేమ వివాహంతో రెండు గ్రామాల మధ్య ఘర్షణ తలెత్తింది. చటాకాయ, నత్తగుళ్లపాడు గ్రామస్థుల మధ్య చెలరేగిన ఈ ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. చటాకాయ గ్రామానికి చెందిన రోజాకుమార్, నత్తగుళ్లపాడుకు చెందిన లక్ష్మీప్రసన్న శుక్రవారం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో ఇరు గ్రామాల మధ్య శనివారం వివాదం తలెత్తింది. అయితే ఆ ప్రేమ జంట వివాహం అనంతరం బుచ్చిరెడ్డిపాలెం పోలీసులను ఆశ్రయించింది.