ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకొని బంగారు ఆభరణాలును దొంగతనం చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను కైకలూరు రూరల్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వారి నుంచి 60 గ్రాముల బంగారం, లక్ష రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ తెలిపారు. కేసును ఛేదించిన సీఐ రవికుమార్, ఎస్ఐ, ఇతర సిబ్బందిని ఎస్పీ అభినందించి, రివార్డులు అందజేశారు.