ముదినేపల్లి మండలం వడాలికి చెందిన మారగాని సరస్వతీ రావు(67) తన భార్య చనిపోయిననాటి నుంచి కొడుకు సురేశ్ బాబు ఇంటిలోనే ఉంటున్నారు. గత నెల 16న రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి నిద్రించారు. ఉదయం లేచి చూసేసరికి సరస్వతీ రావు కనిపించలేదు. అతని ఆచూకీ కోసం అంతా గాలించినా సమాచారం తెలియలేదు. దీంతో శనివారం పోలీసులకు కుమారుడు సురేష్ ఫిర్యాదు చేశాడు. ఎస్సై వీరభద్రరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.