రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తణుకు పర్యటన పురస్కరించుకొని జిల్లా ఉన్నతాధికారులు తణుకులో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. గురువారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ నయీం అస్మి ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో ఏర్పాట్లను పరిశీలించారు. స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ పార్కును ముఖ్యమంత్రి చంద్రబాబు సందర్శించనున్నారు.