రేపు విద్యుత్ సరఫరా నిలిపివేత

57చూసినవారు
రేపు విద్యుత్ సరఫరా నిలిపివేత
కొయ్యలగూడెం మండలంలోని పలు గ్రామాల్లో ఈ నెల 12న విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు జంగారెడ్డిగూడెం విద్యుత్ శాఖ ఈఈ రాధాకృష్ణ తెలిపారు. విద్యుత్ వైర్లపై పడిన చెట్ల కొమ్మలను నరికే చర్యల్లో భాగంగా ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు సరఫరా నిలిపి వస్తున్నట్లు తెలిపారు. కొయ్యలగూడెం, బోడిగూడెం సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాలలో విద్యుత్ సరఫరా ఉండదని, వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్