నర్సాపురం గోదావరిలో చేప పిల్లల మృతి

56చూసినవారు
నరసాపురం గోదావరిలో పొన్నపల్లి సమీపంలో పెద్దఎత్తున చేప పిల్లలు బుధవారం మృతిచెంది తేలడం కలకలం రేపింది. దీనిపై స్థానిక మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేశారు. గతేడాది నుంచి గోదావరిలో మత్స్య సంపద లేకుండా ఇబ్బందులు పడుతున్నామన్నారు. నరసాపురం- పాలకొల్లు రోడ్డులో ఒక ఆక్వా ఫ్యాక్టరీ నుంచి కలుషిత నీరు నేరుగా గోదావరిలోకి వదలడం వల్ల మత్స్య సంపద దెబ్బతింటోందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్