స్వచ్ఛమైన తాగునీరు అందించాలంటూ ధర్నా

78చూసినవారు
స్వచ్ఛమైన తాగునీరు అందించాలంటూ ధర్నా
నరసాపురం పట్టణంలోని 25వ వార్డు ఆదర్శనగర్‌ కాలనీలో మూడు రోజులుగా కుళాయిల ద్వారా వస్తున్న కలుషిత నీటిని అరికట్టి స్వచ్ఛమైన తాగునీరు అందించాలని కోరుతూ బుధవారం కాలనీవాసులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కవురు పెద్దిరాజు మాట్లాడుతూ కుళాయిల ద్వారా నీరు అధ్వానంగా వస్తుందన్నారు. నీళ్లు దుర్వాసన వస్తున్నాయని వాపోయారు. ఈ నీరు తాగితే అతిసార ప్రబలే ప్రమాదముందని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్