ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో నిరాశ్రయులయ్యిన పేద కుటుంబాలకు సహాయం చేసే వ్యక్తిత్వం కలిగి ఉండాలని కొవ్వలి ఫౌండేషన్ కార్యనిర్వహక కార్యదర్శి కొండా శ్రీధర్ పేర్కొన్నారు. నర్సాపురం పట్టణం 7వ వార్డులో మంగళవారం కొవ్వలి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చైర్మన్ కొవ్వలి యతిరాజ రామ్మోహన్నాయుడు ప్రతి నెల రోగులకు అందించే నిత్యాసర సరుకులను, మందులను కొండా శ్రీధర్ పంపిణీ చేశారు.