పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం సుబ్రమణ్యేశ్వరం రోడ్డులోని ఓ చేపల చెరువులో రూపందు చేపలు కనిపించాయి. మనిషి కింది దవడ పళ్ల వలె దంతాలు ఉండడం వీటి ప్రత్యేకత. పిరాన్హా జాతికి చెందిన ఇవి అధిక మాంసాహారులు. రెండు నుంచి మూడుకిలోల బరువుకి పెంచుతారు. చేపల పెంపకందారులు వీటిని జాగ్రత్తగా పట్టాలి, లేదంటే వేళ్లను కొరికే ప్రమాదం ఉంటుంది.