మొగల్తూరు గ్రామ పంచాయతీ పరిధి పాలపర్తి వారి పేటలో 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో గురువారం ఉదయం నరసాపురం మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు పాల్గొని జాతీయ జెండా ఎగురవేసి జెండా వందనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధుల త్యాగల ఫలితమే నేడు దేశ ప్రజలు స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి కారణమన్నారు. వారి నుండి పూర్తి తీసుకుని యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.