నరసాపురం పట్టణం 28, 29వ వార్డులలో గురువారం నిర్వహించిన 'మన కోసం మన నాయకర్' కార్యక్రమంలో నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మిడి నాయకర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు వార్డులలో పర్యటించి సమస్యలు అడగ్గా. డ్రైనేజీ వ్యవస్థ లేక ఇబ్బందులు పడుతున్నట్టు స్థానికులు తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు.