పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొమ్మిడి

67చూసినవారు
పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొమ్మిడి
నరసాపురం పట్టణంలోని 22వ వార్డు కొత్తకాలనీలో మంగళవారం ఎన్టీఆర్ సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ లబ్ధిదారులకు పెన్షన్ అందజేశారు. అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే పెన్షన్ల పెంపు హామీని నెరవేర్చిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని ఏలూరు ఎమ్మెల్యే అన్నారు. మున్సిపల్ కమిషనర్ అంజయ్య, జనసేన నాయకులు కోటిపల్లి వెంకటేశ్వరరావు, భారతి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్