మొగల్తూరు మండలంలోని ముత్యాలపల్లి గ్రామంలో బండి ముత్యాలమ్మను బుధవారం రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు దర్శించుకున్నారు. ఆయన బండి ముత్యాలమ్మ పూరి గుడిసెలో ఉన్న అఖండ జ్యోతిని దర్శించుకున్నారు. ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి జరిగే జాతర గురించి సుబ్బారాయుడు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కడలి మాణిక్యాలరావు, అడ్డాల సూరిబాబు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.