బాలిక(6) పై అఘాయిత్యానికి పాల్పడిన ఘటనపై ఒక వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు మొగల్తూరు ఎస్సై వాసు తెలిపారు. గ్రామానికి చెందిన సలాది శ్రీను బాలికపై అఘాయిత్యానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం ఎస్సై కేసు నమోదు చేశారు. అనంతరం డీఎస్పీ జి. శ్రీవేద అరవింద ఘటనా ప్రాంతానికి వెళ్లి విచారణ చేశారు.