సమాజానికి రోటరీ క్లబ్ అందిస్తున్న సేవలు ఎంతో విలువైనవని నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అన్నారు. శుక్రవారం నరసాపురం పట్టణం కులాయి చెరువు సమీపంలో నేషనల్ హైవే పై రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్మించిన స్వాగతం విగ్రహాన్ని ఎమ్మెల్యే నాయకర్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ సమాజంలో రోటరీ క్లబ్ చేస్తున్న సేవలను గూర్చి కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో డాక్టర్ అచ్యుత్ అంబరీష్, పలువురు నాయకులు పాల్గొన్నారు.