నర్సాపురం పట్టణం 29వ వార్డులో నరసాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి ముదునూరి ప్రసాదరాజు సతీమణి శారదా వాణి మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా వార్డులోని గడపగడపకు వెళ్లి గడిచిన ఐదేళ్ల పాలనలు ముదునూరి ప్రసాదరాజు నరసాపురం పట్టణంలో చేసిన అభివృద్ధి సీఎం జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పాలనను చూసి ప్రజలు మరోసారి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు.