నరసాపురం: అమ్మవారి హుండీ ఆదాయం 10.71 లక్షలు

79చూసినవారు
నరసాపురం: అమ్మవారి హుండీ ఆదాయం 10.71 లక్షలు
మొగల్తూరు మండలం ముత్యాలపల్లి గ్రామంలో వేంచేసిన బండి ముత్యాలమ్మ అమ్మవారి హుండీ ఆదాయం 10, 71, 709/- సమకూరిందని ఆలయ ఈవో మోక అరుణ్ కుమార్ తెలిపారు. గత 50 రోజులుగా భక్తులు అమ్మవారికి సమర్పించుకున్న హుండీ ఆదాయాన్ని నరసాపురంలోని అమరేశ్వర స్వామి ఆలయ ఈవో ఆర్ వి వి రామచంద్ర కుమార్ పర్యవేక్షణలో గురువారం హుండీ ఆదాయం లెక్కించమన్నారు. ఈ లెక్కింపులో ఆలయ చైర్మన్ కడలి మాణిక్యాలరావు పాలక వర్గసభ్యులు, ఆలయ సిబ్బంది పలువురు గ్రామస్తులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you