ప్రభుత్వ ఆదేశాలతో ఈనెల 30 వరకు కొత్త రేషన్ కార్డులు పొందేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు నరసాపురం తహశీల్దార్ సత్యనారాయణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త రేషన్ కార్డులు, తల్లిదండ్రులు కార్డులు నుంచి విడిపోవాలనే వారు, పెళ్లయిన వారు కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చనన్నారు. పిల్లల్ని కార్డుల నమోదు చేయడం, చిరునామా మార్పు, కార్డులో తప్పులు ఉంటే సరిదిద్దుకునేందుకు దరఖాస్తు చేసుకోవచ్చనన్నారు.