నరసాపురం: వారికి డీఎస్పీ వార్నింగ్

79చూసినవారు
నరసాపురం: వారికి  డీఎస్పీ వార్నింగ్
బాలికలు, మహిళలపై బెదిరింపులు, దౌర్జన్యం, అఘాయిత్యాలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని నరసాపురం డీఎస్పీ శ్రీవేద హెచ్చరించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆమె మాట్లాడారు. మొగల్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామానికి చెందిన బాలిక(6)పై అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సలాది శ్రీను (50)ను అరెస్టు చేశామన్నారు. నిందితుడిని కోర్టులో హాజరు పరచగా రిమాండు విధించారన్నారు.

సంబంధిత పోస్ట్