వేట కోసం బుధవారం సాయంత్రం వశిష్ట గోదావరిలోకి వెళ్లిన నరసాపురానికి చెందిన మత్స్యకారుడు నాటిన రాంబాబు (45) తిరిగి ఇంటికి రాలేదు. గాలింపు చేపట్టిన జాలర్లు, పొన్నపల్లి వద్ద వలలో చిక్కుకున్న అతని మృతదేహాన్ని గుర్తించారు. తాళ్ల సాయంతో డెడ్ బాడీని బయటకు తీశారు. గురువారం మృతుని కుటుంబాన్ని ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పరామర్శించి, ప్రభుత్వ సహాయం అందిస్తామని తెలిపారు.