నరసాపురం మండలం యర్రంశెట్టివారిపాలెం శివారులో శనివారం పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న ఐదుగురు పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారి నుంచి రూ. 3, 900 నగదు, 52 పేకాట ముక్కలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే నిందితులపై కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్ఐ టి. వెంకట సురేశ్ తెలిపారు.