నరసాపురం మండలం లక్ష్మణేశ్వరానికి చెందిన అల్లు సర్వేశ్వరరావు (54) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ఈనెల 9న సర్వేశ్వరరావు, మరో ఇద్దరితో కలిసి తన ఇంటి సమీపంలో మామిడికాయలు కోస్తుండగా చెట్టు కొమ్మ విరిగి కిందకు పడిపోయాడు. అతని కుడిపక్క ఎముకలు, ఎడమ కాలు విరిగి గాయాలపాలయ్యాడు. భీమవరంలోని ఓ ప్రైవేట్ అస్పత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.