మొగల్తూరులోని రాజగోపాల స్వామి ఆలయంలో శనివారం వనిత క్లబ్ ఆధ్వర్యంలో చిన్నారులకు సామూహిక భోగి పళ్ళ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా హౌస్, లక్కిడిప్, మ్యూజికల్ చైర్స్ తదితర పోటీలు నిర్వహించారు. ఆయా పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు సీమకుర్తి అరుణ, కార్యదర్శి గుండు లక్ష్మీ కుమారి తదితరులు ఉన్నారు.