నరసాపురం పట్టణంలోని గౌతమి విద్యాసంస్థల నందు ఏర్పాటు చేసిన స్కేటింగ్ గ్రౌండ్ ను మంగళవారం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిన్ననాటి నుండి క్రీడల వైపు ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని సూచించారు. అనంతరం ఇంటర్మీడియట్ ఫలితాలలో మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థినులను అభినందించడం జరిగింది.