మొగల్తూరులో నల్లవారితోటలో ఉపాధి కూలీలపై మినీ వ్యాన్ దూసుకెళ్లిన దుర్ఘటన చాలా బాధాకరం అని ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఘటన స్థలానికి వెళ్లి సందర్శించి అనంతరం ప్రభుత్వాసుపత్రిలో మృతదేహాలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో కలిసి పరిశీలించి, కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని భరోసా కల్పించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు.