బాలికను వేధిస్తున్న యువకుడిపై ఫోక్సో కేసు నమోదు చేశామని నరసాపురం పట్టణ ఎస్సై జయలక్ష్మి బుధవారం తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం. పట్టణానికి చెందిన బాలిక(17) కళాశాలకు వెళ్లే సమయంలో షేక్ ఖురేషీ వెంటపడి వేధిస్తున్నాడు. దీనిపై ఆ బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.